నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తెలుగు ఎమోషనల్ కామెడీ థ్రిల్లర్ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.
దిశ,వెబ్‌డెస్క్:తెలుగు ఎమోషనల్ కామెడీ థ్రిల్లర్ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన తేదీలు కూడా తాజాగా ప్రకటించడం జరిగింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో భాను ప్రకాష్, సృజన్, మణి అగుర్ల, మోహన్ భగత్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈటీవీ విన్‌లోకి ‘సోపతులు’ పేరుతో ఎమోషనల్ కామెడీ డ్రామా మూవీ రాబోతోంది. ఈ మూవీలో డైలాగ్స్ విషయానికొస్తే తెలంగాణ మాండలికంలోనే ఉండనున్నట్లు సమాచారం.
సోపతులు మూవీకి అనంత్ వర్దన్ దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండతో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ వినోద్ అనంతోజు ఈ మూవీకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్నాడు. డైరెక్ట్‌గా ఓటీటీ కోసమే ఈ మూవీని రూపొందించినట్లు సమాచారం. సోపతులు రిలీజ్ డేట్‌ను ఈటీవీ విన్ రివీల్ చేసింది. కావున ఈ చిత్రం ఈ నెల 19వ తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైన ‘వీరాంజనేయులు విహార యాత్ర’ మూవీ క్లీన్ కామెడీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. అయితే ‘సోపతులు’ రిలీజ్ డేట్ పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.