అందుకే రెండేళ్లు గ్యాప్ వచ్చింది.. యంగ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం 'డార్లింగ్'.
దిశ, సినిమా: ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం 'డార్లింగ్'. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించారు. ఈ మూవీ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది చిత్ర బృందం. ఈ సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ.. ‘దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత.. థియేటర్స్‌లో ప్రేక్షకులు నన్ను చూడటానికి, నన్ను నేను థియేటర్స్‌లో చూసుకోవడానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను.
ఆడియన్స్‌కి నా ఎనర్జీ ఇష్టం. యాక్సిడెంట్ కారణంగా నా సోల్జర్‌కి గాయమైయింది. మళ్ళీ ఫుల్‌గా ఫిట్ అయిన మునుపటి ఎనర్జీ వచ్చిన తర్వాతే స్క్రీన్ మీద కనిపించాలని భావించాను. అందుకే బ్రేక్ వచ్చింది. ఇప్పుడు డార్లింగ్‌తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రం ఫన్, లవ్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ వున్న కంప్లీట్ ఎంటర్ టైనర్’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే.. తన తదుపరి చిత్రాల గురించి చెప్తూ.. ‘'స్వయంభూ'తో పాటు మరో రెండు సినిమాలు డిస్కర్షన్‌లో వున్నాయి. ప్రస్తుతం డార్లింగ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను’ అని తెలిపింది.