విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సినిమా షూటింగ్ స్టార్ట్

తమిళ స్టార్ హీరో విజయ్.. ఇటీవల ‘ది గోట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు.

Update: 2024-10-04 12:15 GMT

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విజయ్.. ఇటీవల ‘ది గోట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన తన 69వ సినిమాకు సిద్ధం అవుతున్నాడు. హెచ్‌ వినోథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు టాక్. ఇక ఈ మూవీ నుంచి ఇటీవల పోస్టర్ కూడా రిలీజ్ చెయ్యగా.. నెట్టింట మంచి స్పందన లభించింది. అలాగే ‘విజయ్ 69’లో పూజా హెగ్దే, మమితా బైజు, బాబీ డియోల్ నటిస్తున్నట్లు ఇటీవల అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ పోస్టర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ ఏర్పడింది.

ఇప్పుడు ఇదే జోష్ ఈ చిత్రానికి సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. విజయ్‌ ‘విజయ్ 69’ గ్రాండ్‌గా లాంఛ్ అయింది. చెన్నైలో జరిగిన పూజా కార్యక్రమంలో సినిమా మొదలు కాగా.. ఇందుకు సంబంధించిన స్టిల్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో.. తన అభిమాన హీరో సినిమా ‘విజయ్ 69’ పట్టాలెక్కేసిందని తెలుసుకున్న ఫ్యాన్స్ పండుగా చేసుకుంటున్నారు.


Similar News