మల్టీ స్టారర్ మూవీస్ వేస్ట్.. స్టార్ హీరో విజయ్ షాకింగ్ కామెంట్స్

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా దూసుకుపోతున్న వారు చాలా మంది ఉన్నారు.

Update: 2024-06-06 14:17 GMT

దిశ, సినిమా: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా దూసుకుపోతున్న వారు చాలా మంది ఉన్నారు. వారిలో విజయ్ సేతుపతి ఒకడు. తమిళ్ సినీ ఇండస్ట్రీ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈయన.. తన నటనతో ఆడియన్స్‌లో స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. కోలీవుడ్‌కి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ అందించిన ఈయన.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. అంతేకాకుండా ఇటీవల ‘ఉప్పెన’ మూవీలో విలన్ క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించాడు. ఇదిలా ఉంటే.. త్వరలో ‘మాహారాజా’ అనే చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాల గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఆయన మాట్లాడుతూ.. ‘మల్టీ స్టారర్ మూవీస్ నేను చెయ్యాలి అనుకోవడం లేదు. ఎందుకంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి వాటితో నాకు కొన్ని మంచి, చెడు అనుభవాలు ఉన్నాయి. ఒక ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించినప్పుడు.. ఎవరికి ఎలాంటి పాత్ర వస్తుందో ముందే తెలుస్తుంది. అయితే ఆ పాత్రలో మనం ఎంత బాగా నటించినా కొన్ని సార్లు మనకు ఆశించిన ఫలితం రాకపోవచ్చు. ఇద్దరు స్టార్స్ ఒకే విధంగా కష్టపడితే.. ఎవరో ఒకరికి మాత్రమే పేరు లభిస్తుంది. మరొకరి కష్టాన్ని ఎవరూ గుర్తించరు” అని చెప్పుకొస్తూ.. ఇకపై విలన్ పాత్రల్లో నటించకూడదని అనుకుంటున్నట్లు తెలిపారు.

Similar News