షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన స్టార్ హీరోయిన్.. నెట్టింట ఫొటోలు వైరల్

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

Update: 2024-06-27 16:11 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈమె ప్రజెంట్ హాలీవుడ్ మూవీ ‘ది బ్లఫ్’ చిత్రంతో బిజీగా ఉంది. కార్ల్ అర్బర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఫ్రాంక్ E. ఫ్లవర్స్ దర్శత్వం వహిస్తున్నాడు. రస్సో బ్రదర్స్ బ్యానర్ ఏజీబీఓ స్టూడియోస్, అమెజాన్ఎమ్‌జీఎమ్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే.. ఈ మూవీ కోసం ప్రియాంక బాగా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.

ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ ఆస్ట్రేలియాలో జరగుతున్న క్రమంలో.. ఇటీవలే ప్రమాదంలో షూటింగ్‌లో ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో ఆమె గొంత దగ్గర చిన్న స్క్రాచ్ ఏర్పడింది. ఇప్పుడు మరోసారి ఆమె గాయపడినట్లు తెలుస్తుంది. ఒంటి నిండా గాయాలు తగలడంతో.. ప్లాస్టర్లు వేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రజెంట్ ఇవి నెట్టింట వైరల్ కావడంతో.. ఇవి చూసిన నెటిజన్లు ‘సినిమా కోసం ప్రియాంక బాగా కష్టపడుతున్నట్లు ఉంది’ అంటూ పోస్టులు పెడుతున్నారు.


58 ఏళ్లు వచ్చినా సల్మాన్ ఖాన్‌కు ఎందుకు పెళ్లి కాలేదు.. కారణం చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చిన తండ్రి

Tags:    

Similar News