58 ఏళ్లు వచ్చినా సల్మాన్ ఖాన్‌కు ఎందుకు పెళ్లి కాలేదు.. కారణం చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చిన తండ్రి

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటుడిగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. బిజినెస్ మ్యాన్ గా విజయవంతమైన ఆయన.. సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటాడు. అయితే ఇవన్నీ పక్కన పెడితే

Update: 2024-06-27 16:06 GMT

దిశ, సినిమా: సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటుడిగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. బిజినెస్ మ్యాన్ గా విజయవంతమైన ఆయన.. సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటాడు. అయితే ఇవన్నీ పక్కన పెడితే ముందుగా రొమాంటిక్ హీరోగా పేరుగాంచాడు సల్లూ భాయ్. ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ తోపాటు పలువురు హీరోయిన్లతో లవ్ అండ్ డేటింగ్ చేసిన హీరో.. మధ్యలోనే వారితో విడిపోయాడు. 58ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ విషయంలో అభిమానులు కూడా బాధపడుతున్నారు. ఇంతకీ ఆయన సింగిల్ గా ఎందుకు ఉండాల్సి అవసరం ఏంటనే సందేహంతో ఫీల్ అయిపోతున్నారు.

కాగా తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు హీరో తండ్రి సలీమ్ ఖాన్. ' సల్మాన్ కు తన తల్లిలా ఇంటి బాగోగులు చూసుకునే భార్య కావాలి. వంట నుంచి పుట్టిన పిల్లలు, ఇంట్లో ఉన్న పెద్దలను బాధ్యతగా చూసుకునే అమ్మాయిని కోరుకుంటున్నాడు. కానీ ఈరోజుల్లో అలాంటి వారు లేరు కదా. అందుకే మ్యారేజ్ చేసుకోలేదు ' అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఆన్సర్ తో నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ సల్మాన్ ఖాన్ కు భార్య కావాలా లేక పని మనిషి కావాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ సందేహంతోనే ఒంటరిగా మిగిలిపోయినట్లు ఉన్నాడని నవ్వుతున్నారు.


చీర కట్టులో పూనమ్ బజ్వా - హమ్మయ్య బతికించావ్ అంటున్న అభిమానులు

Similar News