ఒక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే పెళ్లి చేసుకోవద్దు.. నటుడి కామెంట్స్ వైరల్

టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు పొందిన నవాజుద్దీన్ సిద్ధిఖీ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మెప్పించాడు. ఇప్పటి వరకు చేసిన అన్ని పాత్రలకు న్యాయం చేశాడు. అయితే ప్రొఫెషనల్

Update: 2024-06-27 16:11 GMT

దిశ, సినిమా: టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు పొందిన నవాజుద్దీన్ సిద్ధిఖీ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మెప్పించాడు. ఇప్పటి వరకు చేసిన అన్ని పాత్రలకు న్యాయం చేశాడు. అయితే ప్రొఫెషనల్ గా ఇంత సక్సెస్ రేట్ ఉన్న నటుడి పర్సనల్ లైఫ్ మాత్రం డిజాస్టర్ గానే మిగిలిపోయింది. భార్య అలియతో విడాకులు, భరణం, ప్రాపర్టీ అంటూ అనేక రకాలుగా రోడ్డుకెక్కి హెడ్ లైన్స్ టచ్ చేశాడు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి, పిల్లల గురించి తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

' మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తే పెళ్లి చేసుకోవద్దు. నేను ఇలా చెప్పడాన్ని కొందరు తప్పు పట్టొచ్చు. కానీ ఇదే నిజం. ప్రేమలో ఉన్నప్పుడు ఒకరినొకరు ఎక్కువ ఇష్టపడుతారు. కానీ పెళ్లి అయ్యాక సంతోషంగా ఉండలేరు. పిల్లలు ఎంటర్ అయ్యాక పరిస్థితులు మారిపోతాయి. అందుకే మీరు నిజంగా ఒకరిని లైఫ్ లాంగ్ ప్రేమించాలి అనుకుంటే పెళ్లి అనే చట్రంలోకి మాత్రం దిగొద్దు' అని చెప్పుకొచ్చాడు. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆయన చెప్పింది వంద శాతం నిజమని అంటున్నారు. పెళ్లి అయ్యాక రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ రెండు కోల్పోతామని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం పెళ్లి కాకుండా ప్రేమించుకోవడాన్ని, కలిసి ఉండటాన్ని ఏమని పిలవాలని అడుగుతున్నారు.

Similar News