లావణ్య త్రిపాఠి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న వరుణ్ తేజ్..!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-06-30 12:59 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి వరుణ్ వరుస సినిమాలు చేస్తూ విజయం కోసం తాపత్రయ పడుతున్నాడు. కానీ హిట్ కొట్టలేకపోతున్నాడు. ప్రజెంట్ మట్కా సినిమా షూటింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక లావణ్య త్రిపాఠి విషయానికొస్తే.. పెళ్లి తర్వాత ‘మిస్ ఫర్‌ఫెక్ట్’ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. కానీ ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించకుండా సైలెంట్‌గా ఉంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ అడపా దడపా పోస్టులు పెడుతుంది. వరుణ్‌కు షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా వెకేషన్‌కు వెళ్తూ ఈ జంట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ కండీషన్స్ పెట్టడం వల్లే సినిమాలు చేయట్లేదని గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ లావణ్య మాత్రం దేనికి స్పందించకుండా సైలెంట్‌గా ఉంటోంది. ఈ క్రమంలో.. తాజాగా, లావణ్య కోసం వరుణ్ తేజ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. స్వయంగా వరుణ్ తేజ్, లావణ్యతో సినిమాలు చేయించాలని కొంతమంది డైరెక్టర్లతో మాట్లాడుతున్నాడని సమాచారం.

మంచి కథలు ఉంటే లావణ్యకు ఇవ్వాలని రిక్వెస్ట్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లకు కొత్త డౌట్లు మొదలయ్యాయి. ఫ్యామిలీ పరువు పోతుందని సినిమాలు చేయిస్తున్నావు. కానీ లేకుంటే అలాగే ఇంట్లో ఉంచేవాడివా?. నీకు భార్య కెరీర్ కంటే పరువు ముఖ్యమా? అని ట్రోల్ చేస్తున్నారు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం అవన్నీ కొట్టిపారేస్తూ వాళ్ళ జీవితం వారి ఇష్టం మీకేంటి అని అంటున్నారు.

Similar News