‘కల్కి’ సినిమాలో శోభిత.. అమ్మడుకి ఈ టాలెంట్‌ కూడా ఉందా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన సినిమా ‘కల్కి2898ఏడి’.

Update: 2024-06-30 11:59 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన సినిమా ‘కల్కి2898ఏడి’. దీనికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించాడు. అయితే ఇందులో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రాజమౌళి, ఫరియా అబ్దుల్లా, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ఆర్జీవి కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలై బాక్సాఫీసును షేక్ చేస్తోంది. అంతేకాకుండా కలెక్షన్స్ కూడా బాగా రాబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తోంది.

తాజాగా, కల్కిలో శోభిత దూళిపాళ కూడా ఉన్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే శోభిత ఇందులో ఏ పాత్ర చేయనప్పటికీ దీపికా పదుకొణెకు వాయిస్ ఓవర్ ఇచ్చిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. శోభితలో ఈ టాలెంట్ కూడా ఉందా అని అంటున్నారు. కాగా, శోభిత ధూళిపాళ్ల ప్రస్తుతం కథలు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటుంది. ఇటీవల ఈ అమ్మడు మంకీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో అలరించింది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది.

Similar News