Venu Swami: సంచలన వార్త.. అంబానీ ఫ్యామిలీలో గౌరవం పొందిన వేణుస్వామి భార్య వాణికి ఎర్రగడ్డలో ట్రీట్మెంటా?

ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య-శోభితా ధూళిపాళ్లపై సంచలన కామెంట్స్ వివాదంలో చిక్కుకున్నాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి.

Update: 2024-08-15 06:34 GMT

దిశ, సినిమా: ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య-శోభితా ధూళిపాళ్లపై సంచలన కామెంట్స్ వివాదంలో చిక్కుకున్నాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. ఈయన తరచూ ప్రముఖ రాజకీయ నాయకులపై, సెలబ్రిటీలపై జోస్యం చెబుతూ సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలుస్తుంటాడు. పలువురి సెలబ్రిటీల విషయంలో వేణుస్వామి చెప్పిన జాతకం నిజం కావడంతో ఈయన ఏం చెప్పినా రాజకీయాల్లో, సినీ ఇండస్ట్రీలో ఆందోళన నెలకొంటుంది.

అయితే రీసెంట్‌గా నాగ చైతన్య-శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ అనంతరం వీరిద్దరు ఎక్కువ కాలం కలిసి ఉండరని, ఓ అమ్మాయి కారణంగా డివోర్స్ తీసుకుంటారని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా చై-శోభిత 2027 లో విడాకులు తీసుకోవడం ఖాయమని అన్నారు. వేణుస్వామి కామెంట్లపై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్.. తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు కంప్లైంట్ చేశాయి.

వేణుస్వామి ఈ విధంగా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరాయి. అనంతరం వీణ విద్వాంసురాలిగా పేరు తెచ్చకున్న వేణుస్వామి భార్య వాణి కూడా నెట్టింట ఓ వీడియో వైరల్ చేసింది. భర్తకు సపోర్ట్‌గా మాట్లాడటంతో వాణిపై జనాలు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ‘రెండు రోజులుగా ఆమె మానసిక పరిస్థితి బాగోలేదు. వాణికి పిచ్చి పట్టింది కావచ్చు.

నీ భర్త ఏమో పెళ్లికానీ జంటను విడగొట్టాలని చూస్తాడు, నువ్వేమో బహుమతులు కావాలంటావు. మీరు ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి వచ్చారా ఏంటి? అర్జెంట్‌గా వెళ్లి మళ్లీ ట్రీట్మెంట్ తీసుకోండి ఫ్లీజ్. లేకపోతే మీ పిచ్చి పిక్ స్టేజ్‌లోకి వెళ్లిపోతుంది. మరో రెండ్రోజుల్లో మేమే వచ్చి జాయిన్ చెపించేలా ఉన్నాం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంబానీ ఇంట్లో గౌరవం దక్కించుకున్న వాణి ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ అంటే పాపం అనిపిస్తుంది అంటూ మరికొంతమంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News