‘కూర్మనాయకి’గా రాబోతున్న వరలక్ష్మి శరత్‌కుమార్.. ఫస్ట్ లుక్ అదుర్స్

టాలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి క్రేజ్ ఉంది. రవితేజ క్రాక్ సినిమాతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది.

Update: 2024-01-16 09:19 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి క్రేజ్ ఉంది. రవితేజ క్రాక్ సినిమాతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. అంతేకాకుండా వరుస చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో ఉన్న ఏదో ఒక మూవీలో ఉండి హిట్ అందుకుంటుంది. సంక్రాంతికి లక్కీ చార్మ్‌గా మారిపోయింది. ఇటీవల విడుదలైన హనుమాన్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించింది. ప్రస్తుతం ‘కూర్మ నాయకి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా, సంక్రాంతి సందర్భంగా కూర్మ నాయకి ఫస్ట్ రిలీజ్ చేశారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే ఇందేలో బిగ్‌బాస్ శివాజీ కీ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఫస్ట్ వీడియోలో ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించడం గమనార్హం. ‘‘ హాయ్ అందరికీ మీరు చూసిన కూర్మ నాయకి మోషన్‌ పోస్టర్‌ మీ అందరికి నచ్చిందని అనుకుంటా. ఈ సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా రీఎంట్రీలో నేను నటించబోతున్న నా మొట్టమొదటి సినిమా ఇది. ఇందులో నేను ఏం చేయబోతున్నాను, నేను ఎలా ఉండబోతున్నాను.. త్వరలోనే నా క్యారెక్టర్‌, దాని డిజైన్స్‌, మోషన్‌ పోస్టర్‌.. నా ఎంట్రీ అన్ని కూడా త్వరలో రిలీజ్‌ కాబోతుంది. ఇందులో మీరు సరికొత్త శివాజీని చూడబోతున్నారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఫస్ట్ లుకే ఇంత భయంకరంగా ఉంటే.. సినిమా ఎలా ఉంటుందోనని కామెంట్లు చేస్తున్నారు.

Full View



Similar News