మెగాస్టార్‌తో మూవీ ఒప్పుకుని.. చేతులారా కెరీర్ నాశనం చేసుకుంటున్న త్రిష

ఇండస్ట్రీలో సినిమా సినిమాకో కొత్త హీరోయిన్ వస్తున్న రోజులివి.

Update: 2023-06-17 09:53 GMT

దిశ, సినిమా: ఇండస్ట్రీలో సినిమా సినిమాకో కొత్త హీరోయిన్ వస్తున్న రోజులివి. ఇలాంటి జనరేషన్‌లో ఇంకా కెరీర్ కొనసాగిస్తూ ఇండస్ట్రీలో ఇంకా టాప్‌ రేంజ్ మెయింటెన్ చేస్తోంది చెన్నై బ్యూటీ త్రిష. అయితే తాజాగా త్రిష గురించి ఒక విషయం వైరల్ అవుతోంది. గతంలో త్రిష చిరంజీవికి జోడీగా ‘స్టాలిన్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇక మరోసారి చిరుతో నటించేందుకు సిద్ధమైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన మలయాళం కామెడీ ఎంటర్‌టైనర్ ‘బ్రో డాడీ’ రీమేక్‌లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం.

అయితే ఇందులో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో త్రిష.. సిద్ధు తల్లిగా నటించబోతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఇప్పటికీ హీరోయిన్ రోల్ పోషిస్తున్న త్రిష.. ఇలా తల్లిగా నటించేందుకు ఒప్పుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Read More:   డాక్టర్‌ చదివిన అమ్మాయితో Saidharam Tej పెళ్లి.. తల్లి కీలక నిర్ణయం?


Similar News