హీరో కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం..!

స్టార్ హీరో కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పీపుల్స్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు శ్రీనివాస్ (92) అయిన కమల్ హాసన్ మామ నిన్న కొడైకెనాల్‌లో (సోమవారం) తుదిశ్వాస విడిచారు.

Update: 2024-04-23 08:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పీపుల్స్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు శ్రీనివాస్ (92) అయిన కమల్ హాసన్ మామ నిన్న కొడైకెనాల్‌లో (సోమవారం) తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస్ మృతదేహాన్ని చెన్నైకి తీసుకొచ్చి, ఆళ్వార్‌పేటలోని ప్రజా న్యాయ కేంద్రం ప్రధాన కార్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారని కమల్ హాసన్ వెల్లడించారు. ‘నా జీవితంలో అంకుల్ ఆరుయిర్ శ్రీనివాస్ ముఖ్య పాత్ర పోషించారని, మామయ్య తన విప్లవాత్మక ఆలోచనలు, ధైర్య సాహసాల విషయంలో వీరోచిత వ్యక్తి అని కమల్ హాసన్ తెలిపారు. అంత్యక్రియల తర్వాత శ్రీనివాస్ భౌతికకాయాన్ని నిన్న ప్రజానీతి కేంద్రం కార్యాలయానికి తీసుకొచ్చామన్నారు. నేడు ఉదయం 10. 30 గంటలకు బీసెంట్ నగర్ మిన్ మయన్ లో దహన సంస్కారాలు ప్రారంభించామని’’ కమల్ హాసన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.  


Similar News