నేడు దళపతి విజయ్ బర్త్ డే
దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
దిశ, సినిమా: దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి దర్శకుడు కావడంతో చిన్నతనంలో పలు చిత్రాల్లో నటించారు. తర్వాత 1992లో హీరోగా మారాడు. నాలై తీర్పు సినిమాలో నటించారు. ఆ తర్వాత వచ్చిన రసిగన్, దేవా వంటి చిత్రాలు ఆయనకు హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. విజయ్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న సినిమా పువే ఉనకాగే. తుల్లాద మనం తుల్లం మూవీ సూపర్ హిట్ కావడంతో విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఖుషి, ఫ్రెండ్స్, యూత్, తిరుమలై వంటి సినిమాలు ఘనవిజయం సాధించడంతో క్రమంగా ఆయనలో ఉత్సాహాన్ని పెంచాయి. విజయ్ నటన మాత్రమే కాకుండా అద్భుతమైన సింగర్ కూడా. ఇతను ఎన్నో తమిళ పాటలలు పాడాడు.ఆయన పాడిన పాటలు హిట్ పాటలయ్యాయి. నేడు తన 50 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.