పవర్ అనేది డబ్బు, అధికారం కాదు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న "హిట్లర్" ట్రైలర్

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా సినిమా "హిట్లర్".

Update: 2024-09-19 15:38 GMT

దిశ, సినిమా: హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా సినిమా "హిట్లర్". యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి ధన దర్శకత్వం వహిస్తున్నాడు. చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్‌గా "హిట్లర్" సినిమాను నిర్మిస్తుండగా.. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ రిలీజ్ సమయం దగ్గర పడటంతో వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూస్తే.. ‘ఈ ప్రపంచంలో నిజమైన పవర్ అన్నది డబ్బు, అధికారం కాదు. ఒక మనిషిని నమ్మి అతని వెనకున్న జనమే’ అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్‌లో.. విజయ్ ఆంటోనీ డిఫరెంట్ గెటప్స్‌లో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ముగ్గురిని కాల్చి చంపేస్తాడు. అతని కోసం పోలీసులు వేట సాగిస్తుంటారు. యాక్షన్ సీక్వెన్సులతో పాటు రొమాంటిక్ లవ్ స్టోరీని ట్రైలర్‌లో రివీల్ చేశారు. ఇక ఇందులో ఓ స్వార్థపూరిత నాయకుడి పాత్రలో చరణ్ రాజ్ కనిపిస్తారు. విజయ్ ఆంటోనీ పర్ ఫార్మెన్స్, రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ట్రైలర్‌కు హైలైట్స్‌గా నిలిచాయి. కాగా.. ఈ సినిమా సెప్టెంబర్ 27న హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. 


Similar News