‘ఎక్కడో కొడుతుంది సీనా’.. NTR దేవర చిత్రంపై ట్రోల్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’.

Update: 2024-09-19 15:48 GMT

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా.. హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ‘దేవర’ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచుతూ.. వరుస ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్ ఈవెంట్‌లో ‘దేవర’ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు ఎన్టీఆర్ తెలిపాడు. ఈ కామెంట్స్ ప్రజెంట్ నెట్టింట వైరల్ కావడంతో.. అనూహ్యంగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

ఎన్టీఆర్ గతంలో వచ్చిన ‘దమ్ము, శక్తి’ చిత్రాలను గుర్తు చేస్తూ నెట్టింట మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అప్పుడు కూడా ఆ రెండు సినిమాల ఆడియో ఫంక్షన్స్‌లో ఎన్టీఆర్ చాలా కాన్ఫిడెంట్‌గా అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా ఈ చిత్రాన్ని తీయడం జరిగిందని చెప్పాడు. కానీ ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్దా డిజాస్టర్‌గా నిలిచాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న దేవర విషయంలో కూడా ఎన్టీఆర్ అదే కాన్ఫిడెన్స్ కనబరుస్తుండతంతో.. ఇదేదో తేడా కొడుతుంది అంటూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. దీనికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ‘టెంపర్’ దగ్గర నుంచి వరుస సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి అంటూ ట్రోలర్స్‌పై మండిపడుతున్నారు ఫ్యాన్స్. 



Similar News