Director Bapu: నేడు బాపు వర్ధంతి

నేడు బాపు వర్ధంతి

Update: 2024-08-31 02:25 GMT

దిశ, వెబ్ డెస్క్: బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మినారాయణ. ఈయన 1933 డిసెంబర్ 15 న పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్ లో జన్మించారు. బాపు అని పేరు తలచుకోగానే బొమ్మలు గుర్తొస్తాయి. వనవాసంలో ఉన్న సీతమ్మ గురించి చెప్పాలన్నా.. వాలుజడ, కాటుక కనులున్న అమ్మాయిల అందాలను పొగడాలన్నా.. సిగ్గు పడుతున్న వయ్యారాలు ఒలకబోసే పడుచందాలను అచ్చుగుద్దినట్లుగా చిత్రించాలన్నా అది కేవలం బాపుకే సుసాధ్యం. ఒక్కముక్కలో చెప్పాలంటే పడుచు పిల్ల నుంచి చీర కట్టు అమ్మాయి వరకు వర్ణించడానికి కొత్త పదాలు అవసరం లేదు. బాపు గారి బొమ్మ అంటే చాలు. ఆయన మొదటి సినిమా సాక్షి చివరి చిత్రం శ్రీరామరాజ్యం. మొత్తం 51 సినిమాలకు డైరెక్షన్ చేసి ముత్యాల ముగ్గు, మిస్టర్ పెళ్లాం మూవీకి జాతీయ అవార్డులు అందుకున్నారు. ఈ రోజు బాపు వర్ధంతి. ఈ సందర్భంగా నటీ నటులు, ప్రముఖులు ఆయన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా పోస్టులు పెడుతున్నారు.

Tags:    

Similar News