ప్రపంచంలోనే భారీ కలెక్షన్స్ సాధించి.. రికార్డు క్రియేట్ చేసిన సినిమా ఇదే!

భారీ కలెక్షన్లు రాబట్టడంలో ఒకదానికి మించి మరొక సినిమా పోటీపడుతున్నాయి.

Update: 2023-07-30 13:53 GMT
ప్రపంచంలోనే భారీ కలెక్షన్స్ సాధించి.. రికార్డు క్రియేట్ చేసిన సినిమా ఇదే!
  • whatsapp icon

దిశ, సినిమా: భారీ కలెక్షన్లు రాబట్టడంలో ఒకదానికి మించి మరొక సినిమా పోటీపడుతున్నాయి. కానీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా మాత్రం ఒకటే. దాని పేరు ‘పారానార్మల్‌ యాక్టివిటీ’. ఈ సినిమాను 2007లో హాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓరెన్‌ పెలి తెరకెక్కించాడు. తనే కథ రాసుకుని, దర్శకత్వం వహించి స్వయంగా నిర్మించారు. ఈ మూవీని ఆయన కేవలం 15 వేల డాలర్లలతో తీశాడు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.6 లక్షల ఖర్చు. కానీ పారామౌంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ ఈ సినిమాను సొంతం చేసుకుని క్లైమాక్స్‌లో కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేశారు. టోటల్‌గా రూ.90 లక్షలు ఖర్చు అయింది. మొత్తానికి విడుదలైన ఈ మూవీ ఎవరూ ఊహించని రేంజ్‌లో హిట్ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 193 మిలియన్‌ డాలర్లు రాబట్టింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.800 కోట్లు. దీంతో ప్రపంచంలోనే తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది రికార్డును సృష్టించింది.

Tags:    

Similar News