విడాకుల కోసం మూడు సార్లు కోర్టుకెక్కి.. అయినా విడిపోని స్టార్ కపుల్ ఎవరో తెలుసా?
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేమ, పెళ్లి ఎంత త్వరగా జరుగుతుందో, విడిపోవడం కూడా అంతే త్వరగా జరిగిపోతుంది.ఇప్పటికే టాలీవుడ్లో సమంత, నిహారిక, శ్రీజ ఇలా చాలా మంది వివాహం చేసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.
దిశ, సినిమా : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేమ, పెళ్లి ఎంత త్వరగా జరుగుతుందో, విడిపోవడం కూడా అంతే త్వరగా జరిగిపోతుంది.ఇప్పటికే టాలీవుడ్లో సమంత, నిహారిక, శ్రీజ ఇలా చాలా మంది వివాహం చేసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ స్టార్ జంట విడాకులకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో టాప్ జంట, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో, హీరోయిన్ ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు సంతోషంగా వీరి కాపురం సాగింది. ఇక ఆ తర్వాత చిన్న చిన్నగా గొడవలు రావడం మొదలైంది. అవి కాస్త పెద్దగా మారడంతో ఇద్దరూ విడిపోదాం అని ఫిక్స్ అయ్యారు. విడాకుల కోసం కోర్టు వరకు వెళ్లి, పెద్దల ఒప్పందంతో మళ్లీ కలిసిపోయి కాపురం చేస్తున్నారంట. అయితే ఇది ఒక్కసారి కాదు. ఇలా మూడు సార్లు వారు విడిపోవడం కోసం కోర్టు మెట్లు ఎక్కినా ఇప్పటికీ కలిసే కాపురం చేస్తున్నారు.
పెళ్లయిన తర్వాత వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధలే, వారి సంసార జీవితంలో చాలా పెద్ద సమస్యలను తీసుకొచ్చిందంట. అలా అవి వారికి పెద్ద ఇబ్బందులను తీసుకొచ్చి పిల్లలు ఉన్నా, వారిని కాదనుకొని విడాకుల కోసం కోర్టు వరకు వెళ్లారు. ఇక విడిపోవడమే అనుకునే సమయంలో పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఆఖరి నిమిషంలో వీరు విడాకుల ఆలోచనను వెనకకు తీసుకున్నారు. తర్వాత పెద్దల మధ్య మాట్లాడి , సమస్యను పరిష్కరించుకున్నారు. అలా వీరు మూడు సార్లు కోర్టు మెట్లు ఎక్కి కూడా విడిపోలేదు.
ఇక ప్రస్తుతం ఈ స్టార్ కపుల్ సీనియర్స్ అయ్యారంట. వీరు ఇండస్ట్రీకి దూరమై, తమ పిల్లలు, ఫ్యామిలీతో ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంన్నారంట.ఇక ఇది చూసిన వారందరూ,ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, వారు పరిష్కరించుకున్నారు తప్పితే విడిపోలేదు, అలా ఉండాలి జంట అంటే, రియల్‌గా మీరు బెస్ట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.