Devara Movie: చివరి నలభై నిమిషాలు సూపర్ .. దేవరపై ఎన్టీఆర్ కామెంట్స్..

చివరి నలభై నిమిషాలు సూపర్

Update: 2024-09-11 03:39 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ దేవర మూవీ ట్రైలర్ మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా.. దీనిలోని విజువల్స్ కి మతి పోతుంది. ట్రైలర్ తో దేవర మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ముంబైలో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, కొరటాల శివ, జాన్వీ కపూర్, కరణ్ జోహార్ హాజరయ్యారు.

ఈ క్రమంలోనే అక్కడి మీడియాతో చిట్ చాట్ చేసారు. మీడియాలో అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర మూవీలో చివరి నలభై నిముషాలే కీలకం.. ఆడియెన్స్ ఆ యాక్షన్ విజువల్స్ ఎప్పుడు చూస్తారా అని చాలా ఎదురుచూస్తున్నాను. కొరటాల శివ ఆ సీన్స్ ఓ రేంజ్ లో తీశారంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేసారు. ఆ షార్క్ షాట్ తీయడానికి 24 గంటల పాటు చాలా కష్ట కష్టపడ్డాను అంటూ ఆయన తెలిపారు.

ఎన్టీఆర్ ఎప్పుడూ ఇలా చెప్పలేదు.. తానే నలభై నిముషాలు సూపర్ అని చెప్పడంతో అభిమానులు మూవీ పై భారీగానే అంచనాలు పెంచుకుంటున్నారు. 

Tags:    

Similar News