విడాకుల కోసం కోర్టుకు అలనాటి హీరోయిన్.. కారణం ఏంటంటే?

తెలుగు, తమిళ చిత్రాల్లో తనదైన శైలీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఊర్మిళ మతోండ్కర్ గురించి సుపరిచితమే.

Update: 2024-09-25 06:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు, తమిళ చిత్రాల్లో తనదైన శైలీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఊర్మిళ మతోండ్కర్ గురించి సుపరిచితమే. ముంబైలో పుట్టి పెరిగిన ఊర్మిళ బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ బ్యూటీ తొలిసారిగా ‘కర్మ’ మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్లిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా మంచి ఫ్యాన్ ఫాలొయింగ్ సొంతం చేసుకుంది. రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రంగీలా’ చిత్రం ఈ ముద్దుగుమ్మకు మంచి పాపులారిటీ తీసుకొచ్చింది.

అయితే ఈ బ్యూటీకి సంబంధించిన ఓ న్యూస్ ప్రజెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. అది ఏంటంటే.. ప్రముఖ నటి ఊర్మిళ తన ఎనిమిదేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. తన భర్త మోసిన్ అక్తార్ మిర్‌తో విడాకులు తీసుకోనున్నట్లు సమాచారం. నాలుగు నెలల క్రితం ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. వీరు విడిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా జమ్మూకశ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త మోసిన్‌‌ను 2016 ఫిబ్రవరి 4న ఆమె పెళ్లాడారు.


Similar News