అండర్ వేర్ ధరించడం కూడా మానేశనంటున్న హీరో.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

హీరో సుధీర్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన మొదటి సారిగా ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. తర్వాత శివ మనసులో శృతి అనే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు

Update: 2024-06-13 08:44 GMT

దిశ, సినిమా : హీరో సుధీర్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన మొదటి సారిగా ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. తర్వాత శివ మనసులో శృతి అనే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తర్వాత ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు ఈ హీరో. ఇక తర్వాత ఆడు మగాడ్రా బుజ్జీ, దొంగాట, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, మోసగాళ్లకు మోసగాడు, భలే మంచి రోజా. శ్రీ శ్రీ, బాఘీ లాంటి చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఆయన అంతగా సక్సెస్ సాధించలేకపోయారు. కాగా, మరోసారి ఈ హీరో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు.  దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన హరోం హర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ జూన్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా, తాజాగా ఈ మూవీటీం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఇందులో సుధీర్ బాబు చేసిన పలు కామెంట్స్ అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. అయితే డైరెక్టర్ తమకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయని వాటిని మూవీ టీమ్ అందరిపై రుద్దేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని సుధీర్ బాబును అడగ్గా, ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. హీరో మాట్లాడుతూ.. దర్శకుడు ఏం చెప్పినా చేయాలనిపిస్తుంది. తనకు న్యూమరాలజీ, దేవుడు, నమ్మకాలు ఎక్కువ, వీటి పై ఆయన చాలా నాలెడ్జ్ ఉంది అనిపిస్తుంటుంది. అందుకే ఆయన చెప్పినవీ రియల్ లైఫ్‌లో కూడా పాటించాలి అనిపిస్తుంటుంది. ఆయన నాతో సినిమా చేస్తున్న క్రమంలో బ్లాక్ కలర్ కారు ఉంటే దానిని మార్చేయమని సలహా ఇచ్చారు. దీంతో వెంటనే అది మార్చేశాను. అలాగే ఆయన బ్లాక్ కలర్ మొత్తానికే వాడకూడదు అని చెప్పడం వలన నేను నా బ్లాక్ కలర్ అండర్ వేర్ కూడా వేసుకోవడం లేదు, అసలు సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి బ్లాక్ కలర్ వాడటం మానేశాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సుధీర్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Similar News