షూటింగ్‌ సెట్లో అందరిముందు స్టార్ హీరోయిన్‌ను అలా అడిగేసిన హీరో తల్లి!

టాలీవుడ్ హీరో తరుణ్, ప్రియమణి ‘‘నవవసంతం’’ చిత్రంలో నటించి ప్రేక్షకుల మనసులో నిలిచిన విషయం విదితమే.

Advertisement
Update: 2023-06-05 13:15 GMT
షూటింగ్‌ సెట్లో అందరిముందు స్టార్ హీరోయిన్‌ను అలా అడిగేసిన హీరో తల్లి!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో తరుణ్, ప్రియమణి ‘‘నవవసంతం’’ చిత్రంలో నటించి ప్రేక్షకుల మనసులో నిలిచిన విషయం విదితమే. కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని, ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చుకున్నారని, చివరకు తరుణ్.. ప్రియమణికి ఇన్నోవా కారు కూడా ఇచ్చాడని నెట్టింట బాగానే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో హాజరై ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ‘‘తరుణ్ వాళ్ల అమ్మ ‘రోజా రమణి’ ఒకరోజు సెట్స్‌కు వచ్చింది. మీరిద్దరు లవ్‌లో ఉన్నారని తెలుసు, నువ్వు ఓకే అంటే పెళ్లి చేస్తాను అని అన్నారు. తను అలా అడగ్గానే.. మీరు తప్పుగా అనుకుంటున్నారు. అవన్నీ పుకార్లు మాత్రమేనని చెప్పాను. లేకపోతే తరుణ్ ఈ రోజు భార్య అయిపోయేదాన్ని’’. అంటూ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News