ముదురుతున్న వివాదం.. ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య చిచ్చు పెట్టిన యూట్యూబ్..

'యశోద' సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న భామ కల్పిత గణేష్. ఆ సినిమా నుంచి క్రేజ్ తెచ్చుకున్న కల్పిత..

Update: 2022-12-17 08:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: 'యశోద' సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న భామ కల్పిత గణేష్. ఆ సినిమా నుంచి క్రేజ్ తెచ్చుకున్న కల్పిత.. అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే ధన్యబాలకృష్ణ గురించి ఓ వీడియోలో మాట్లాడడంతో.. అవి వైరల్‌గా మారి రచ్చరచ్చ చేస్తున్నాయి.

కల్పిత మాట్లాడుతూ.. ధన్య బాలకృష్ణ.. తమిళ్ డైరెక్టర్‌ బాలాజీ మెహన్‌తో రిలేషన్‌లో ఉందని చెప్పుకొచ్చింది. ఈ ఏడాది జనవరిలో వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నరని తెలిపింది. ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన కొన్ని రోజులకే తన యూట్యూబ్ నుంచి ఆ వీడియో కల్పితకు తెలియకుండా డిలీడ్ అయింది. ఈ విషయం పై స్పందించిన కల్పిక.. ''నాకు తెలియకుండా ధన్య నా యూట్యూబ్‌లో వీడియోను డిలీట్ చేసింది. నన్ను అనవసరంగా గొడవలోకి లాగుతున్నావ్. నీ విషయాలు చెప్పేసరికి ఫస్ట్ బ్లాక్ చేశావ్.. మరల ఇప్పుడు కాల్స్ చేసి మాట్లాడుతున్నావ్. నన్ను భయపెట్టాలని చూస్తున్నావా..? లేక నువ్వు భయపడుతున్నావా..? నీ పవర్ చూపించి వీడియో డిలీట్ చేయించావు. ఇక నా పవర్ ఏంటో చూపిస్తా. ఇక కోర్టులో చూసుకుందాం'' అంటూ ధన్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కల్పిక. మరి ఈ ఇద్దరి ముద్దుగుమ్మల వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

Tags:    

Similar News