The GOAT : బాక్సాఫీస్ వద్ద ' ది గోట్ ' దూకుడు.. నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

బాక్సాఫీస్ వద్ద ' ది గోట్ ' దూకుడు.

Update: 2024-09-11 08:14 GMT

దిశ, వెబ్ డెస్క్: తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తలపతి ప్రధాన పాత్రలో నటించిన కొత్త మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సెప్టెంబర్ 5 న రిలీజ్ అయి ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. గాంధీ కథను అనుసరిస్తూ సాగిన ఈ మూవీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ. 100 కోట్లను కలెక్ట్ చేసి కొత్త రికార్డు ను క్రియోట్ చేసింది.

తాజాగా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీకి సంబందించిన కలెక్షన్స్ బయటకు వచ్చాయి. నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 288 కోట్లను కలెక్ట్ చేసింది. చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా అధికారికంగా వెల్లడించింది. “ నాలుగు అంటే నాలుగు రోజుల్లో రూ. 288 కోట్లు జస్ట్ విజయ్ తలపతి థింగ్స్” అంటూ కొత్త పోస్టర్ షేర్ చేశారు. వీకెండ్ రావడంతో సూపర్ బిజినెస్ చేయడంతో వసూళ్లు బాగా పెరిగాయి.

మొదటి రోజు రూ. 44 కోట్లు, రెండవ రోజు రూ.25.5 కోట్లు కలెక్ట్ చేసింది. అలా మొదలైన కలెక్షన్స్ ఇప్పటికి అదే దూకుడుగా ఉన్నాయి. ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ ప్లే చేశారు. తండ్రీ కొడుకులుగా ప్రేక్షకులను అలరించారు.

Tags:    

Similar News