Tamannaah:మరో ఐటెం సాంగ్‌లో గ్లామర్ స్టెప్పులతో ఇరగదీసిన స్టార్ హీరోయిన్. (ఫుల్ సాంగ్)

‘జై లవకుశ, అల్లుడు శీను,గని, జైలర్’ వంటి సినిమాల్లో ఐటెం సాంగ్‌లో స్టెప్పులేసి కుర్రాళ్లకు చెమటలు పట్టించింది టాలీవుడ్ అగ్ర కథానాయిక తమన్నా భాటియా.

Update: 2024-07-25 10:40 GMT
Tamannaah:మరో ఐటెం సాంగ్‌లో గ్లామర్ స్టెప్పులతో ఇరగదీసిన స్టార్ హీరోయిన్. (ఫుల్ సాంగ్)
  • whatsapp icon

దిశ, సినిమా: ‘జై లవకుశ, అల్లుడు శీను,గని, జైలర్’ వంటి సినిమాల్లో ఐటెం సాంగ్‌లో స్టెప్పులేసి కుర్రాళ్లకు చెమటలు పట్టించింది టాలీవుడ్ అగ్ర కథానాయిక తమన్నా భాటియా. ఈ అమ్మడు స్టెప్పులేసిన ప్రతి ఒక సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. మిల్క్ బ్యూటీ ఐటెం సాంగ్ చేసిందంటే ఈ మూవీకి పక్కా ఎక్ట్రా మైలేజీ రావాల్సిందే. మిల్క్ బ్యూటీ గ్లామరంటే యూత్ అంతలా పడిచచ్చిపోతారు మరీ.

అయితే తాజాగా ఈ గ్లామర్ బ్యూటీ మరో ఐటెమ్ సాంగ్‌కు స్టెప్పులేసి అదరహో అనిపిస్తుంది. కుర్రవాళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు.సచిన్ జిగార్ ద్వయం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘స్త్రీ’ అనే సినిమాలో శ్రద్దా కపూర్ అండ్ రాజ్ కుమార్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన థియేట్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాలో తమన్నా చేసిన స్పెషల్ పాటను విడుదల చేశారు. ‘ఆజ్ కి రాత్’ అనే సాగే ఈ సాంగ్‌లో మిల్స్ బ్యూటీ.. స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు తన గ్లామర్ స్టెప్పులతో ఇరగదీసింది. ఆడియన్స్ చూపు పక్కకు తిప్పుకోనియకుండా చేసింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. మంచి రెస్పాన్స్ లభిస్తుంది. 


Full View


Tags:    

Similar News