Tamannaah Bhatia: వాళ్లను చూస్తుంటే పేరెంటింగ్‌లో డిగ్రీ తీసుకున్నట్లు అనిపిస్తుంది.. మిల్క్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా తాజాగా పిల్లల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది

Update: 2024-09-13 09:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా తాజాగా పిల్లల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘తల్లి కావాలంటే నాకు చాలా భయమేస్తుందని తెలిపింది. తల్లి అంటే పిల్లలకు అన్ని ఇస్తుందని, నా పిల్లలకు అంత ప్రేమ, కేరింగ్ నేను ఇవ్వలేనని పేర్కొంది. నా పేరెంట్స్ నాకు చాలా ప్రేమ పంచారని తెలిపింది. వారిని చూస్తుంటే పేరెంటింగ్‌లో డిగ్రీ తీసుకున్నట్లు అనిపిస్తుందంటూ మిల్క్ బ్యూటీ వెల్లడించింది. అలాగే పిల్లలు జన్మించాక ఏం జరుగుతుందో అని భయంగా ఉంటుందని తెలిపింది’.

సినిమాల విషయానికొస్తే..

తమన్నా భాషతో సంబంధం లేకుండా సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. హ్యాపీ డేస్, ఎందుకంటే...ప్రేమంట, రచ్చ, ఊసరవెల్లి, బద్రీనాథ్, 100% లవ్, రెబెల్, కెమెరామెన్ గంగతో రాంబాబు, తడాఖా, బాహుబలి, బెంగాల్ టైగర్, సైరా నరసింహారెడ్డి, జైలర్, భోలా శంకర్, స్త్రీ 2 వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో గొప్ప గుర్తింపు దక్కించుకుంది.ఈ బ్యూటీ ఐటెమ్ సాంగ్స్‌లో కూడా అదరగొడుతోంది. ఇండస్ట్రీకి వచ్చి.. ఇన్నేళ్లు అవుతున్నా.. చెక్కు చెదరని అందంతో కుర్రాళ్ల మతిపోగుడుతుంటుంది. 

ఇక ఈ మిల్క్ బ్యూటీ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో చాలా కాలంగా రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ తమన్నా-విజయ్ వర్మ ప్రేమ మాత్రం నిజమే. ఫొటోలు పంచుకోవడంతో పాటు తమన్నా వీరి ప్రేమ విషయం అధికారికంగా ప్రకటించింది కూడా. 


Similar News