లవర్‌ను కాదని ఆ స్టార్ హీరోతో తమన్నా రొమాన్స్..మోజు తీరిపోయిందంటున్న ట్రోలర్స్!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. చాలా సినిమాల్లో ఈ నటి తన నటన గ్లామర్‌తో అదరగొట్టి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇక శ్రీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ

Update: 2024-06-01 02:24 GMT

దిశ, సినిమా : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. చాలా సినిమాల్లో ఈ నటి తన నటన గ్లామర్‌తో అదరగొట్టి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇక శ్రీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. హ్యాప్పీ డేస్, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కాళిదాసు లాంటి సినిమాల్లో నటించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమాల ద్వారా అంతగా గుర్తింపు రాలేదు. 100% లవ్ సినిమాతో తమన్నా ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్రదీనాథ్, ఊసరవెల్లి ఇలా స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. ఇక తెలుగులో ఆఫర్స్ రావడం తగ్గిపోయాక తమన్నా ఏకంగా బాలీవుడ్ చెక్కేసి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో లవ్‌లో పడిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా అందుతున్న సమచారం ప్రకారం. ఈ బ్యూటీ తన లవర్‌కు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్లితే..రీసెంట్‌గా తమన్నా అరణ్మనై4 మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఈ మూవీ సక్సెస్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిల్కీ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అయితే యాంకర్ మీరు అరుణ్మనై4 మూవీని ఎవరితో కలిసి చూడాలి అనుకుంటున్నారు; ఎవరితో డేటింగ్ వెళ్లడం ఇష్టం అని అడగ్గా, నాకు షారుఖ్ అంటే ఇష్టం, కాబట్టి తనతో వెళ్లాలి అనుకుంటున్నాను, అలాగే ఆయనతో సినిమా చేయడానికి ఇష్టపడుతాను అంటూ చెప్పుకొచ్చింది. అందరూ తమన్నా తన లవర్ పేరు చెప్తుంది అనుకున్నారు. కానీ మిల్కీ బ్యూటీ మాత్రం స్టార్ హీరో పేరు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. లవర్ పై ఇష్టం తీరిపోయినట్టు ఉంది. అందుకే మరో స్టార్ హీరోను లైన్‌లో పెడుతుంది అంటున్నారు కొందరు ట్రోలర్స్.


Similar News