Pawan Kalyan: మెగా ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ‘పుష్ప-2’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు డిప్యూటీ సీఎం?
అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule).
దిశ, సినిమా: అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule). దీనిని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తున్నారు. ఇందులో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల(Sreeleela) ఐటెం సాంగ్ ‘కిస్సిక్’లో మెరవనుంది. ‘పుష్ప-2’ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల సిద్ధమైంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ పలు ప్రదేశాల్లో ఈవెంట్స్ నిర్వహించి హైప్ పెంచారు. ప్రజెంట్ అందరి దృష్టి ‘పుష్ప-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై పడింది.
అయితే దీని కోసం హైదరాబాద్ పోలీసులను కోరగా వారు అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 2వ తేదీన యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో ‘పుష్ప-2’ ప్రీ-రిలీజ్(Pre-release) ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే.. తాజాగా, ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘పుష్ప-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గెస్ట్‌గా వెల్లబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Read More...
Pawan Kalyan: ‘OG’ అప్డేట్ అడిగిన అభిమాని.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన నిర్మాణ సంస్థ