కొడుకు కోసం ఖతర్నాక్ ఫిగర్‌ను లైన్‌లో పెడుతున్న సుమ!

యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మాటలు, పంచ్ డైలాగ్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక యాంకరింగ్‌లో తనను మించిన తోపులేరన్నది వాస్తవం. అయితే ఈ మె ప్రస్తుతం తన కొడుకు కెరీర్‌పై స్పెషల్ ఫొకస్ పెట్టిందంట.

Update: 2024-02-03 09:49 GMT
కొడుకు కోసం ఖతర్నాక్ ఫిగర్‌ను లైన్‌లో పెడుతున్న సుమ!
  • whatsapp icon

దిశ, సినిమా : యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మాటలు, పంచ్ డైలాగ్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక యాంకరింగ్‌లో తనను మించిన తోపులేరన్నది వాస్తవం. అయితే ఈ మె ప్రస్తుతం తన కొడుకు కెరీర్‌పై స్పెషల్ ఫొకస్ పెట్టిందంట.

సుమకనకాల కొడుకు రోషన్ బబుల్గం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ రిజల్ట్స్ ఎలా ఉన్నా.. నటుడిగా మాత్రం రోషన్ మెప్పించాడంట. అంతే కాకుండా తన నటన , రొమాన్స్‌తో యూత్‌ను తెగ ఆకట్టుకున్నాడు.దీంతో ఈ కుర్ర హీరో మరో మూవీకి రెడీ అయ్యాడంట. అయితే ఆ సినిమా కోసం సుమ ఓ కత్తిలాంటి ఫిగర్‌ను ఓకే చేసిందంట. ఆమె ఎవరో కాదు బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఈమెను సుమ రోషన్ సెకండ్ మూవీకి లైన్‌లో పెడుతున్నట్లు ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా, ఒక వేళ రోషన్, వైష్ణవి కాంబినేషన్‌లో మూవీ వస్తే, వీరు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటారో చూడాలి అంటున్నారు నెటిజన్స్.

Tags:    

Similar News