బాలీవుడ్ నటికి షాకిచ్చిన సుఖేష్.. ఆ పని చేయకపోతే వదలనంటూ

మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి చాహత్ కన్నాకు ఊహించని షాక్ ఇచ్చాడు. తీహారు జైల్లో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ సదరు నటిమీద

Update: 2023-02-12 08:29 GMT
బాలీవుడ్ నటికి షాకిచ్చిన సుఖేష్.. ఆ పని చేయకపోతే వదలనంటూ
  • whatsapp icon

దిశ, సినిమా: మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి చాహత్ కన్నాకు ఊహించని షాక్ ఇచ్చాడు. తీహారు జైల్లో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ సదరు నటిమీద రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. విషయానికొస్తే.. 'చాహత్ కన్నా చేసిన తప్పుడు ఆరోపణల కారణంగా నా పరువు పోయింది. ఆమె వల్ల మానసికంగా తీవ్ర క్షోభ అనుభవించా' అంటూ తాజాగా వేసిన పరువు నష్టం దావాలో సుఖేష్ పేర్కొన్నాడు. అంతేకాదు తన న్యాయవాది ద్వారా ఆమెకు లీగల్ నోటీసులు పంపించినట్లు తెలిపిన సుఖేష్.. వారం రోజుల్లో ఈ విషయం మీద ఆమె క్షమాపణలు చెప్పాలని, లేకపోతే లీగల్‌గా అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడం విశేషం. కాగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో చాహత్ మాట్లాడుతూ.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తరహాలోనే తనని కూడా సుఖేష్ మోసం చేయడానికి ప్రయత్నించాడని, బలవంతంగా తీహార్ జైలుకు రప్పించి పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడంటూ పలు ఆరోపణలు చేసింది.

Tags:    

Similar News