సోషల్ మీడియాలో ప్రణీత్ హనుమంత్ రావుపై గరం గరం.. క్లారిటీ ఇచ్చిన సుధీర్ బాబు

తండ్రి, కూతురు మధ్య ఉండే పవిత్ర బంధంపై డార్క్ కామెడీ చేసిన ప్రణీత్ హనుమంత్ రావు అండ్ బ్యాచ్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. పొట్టు పొట్టు తిట్టి పోస్తున్నారు నెటిజన్లు.

Update: 2024-07-08 13:33 GMT

దిశ, సినిమా: తండ్రి, కూతురు మధ్య ఉండే పవిత్ర బంధంపై డార్క్ కామెడీ చేసిన ప్రణీత్ హనుమంత్ రావు అండ్ బ్యాచ్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. పొట్టు పొట్టు తిట్టి పోస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ వ్యక్తి తాజాగా సుధీర్ బాబు హీరోగా వచ్చిన 'హరోం హర' చిత్రంలో నటించాడు. ఈ క్రమంలో ఈ సంఘటనపై స్పందించాడు హీరో. ' మంచో చెడో నేను సోషల్ మీడియా పర్సన్ కాదు. హనుమంత్ రావు గురించి నాకు ముందు తెలియలేదు. అందుకే మా చిత్రంలో తీసుకున్నాం. ఇందుకు నేను, నా టీమ్ మొత్తం మీకు క్షమాపణలు చెప్తుంది. ఈ జబ్బుపడిన మనుషులు ఇలాంటి డార్క్ కామెడీని స్ప్రెడ్ చేయకుండా ఉండాలంటే.. ఇందుకు ఏ ప్లాట్ ఫామ్ సపోర్ట్ చేయకూడదు. ఇది వాక్ స్వాతంత్ర్యం కాదు ' అని పోస్ట్ పెట్టాడు.

కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఇందులో మీ తప్పు లేదు అని సుధీర్ బాబును సమర్థిస్తున్నారు. హన్మంతు రావు లాంటి నీచులకు ఫ్యూచర్ ఉండకూడదు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయకూడదని కోరుతున్నారు.


Similar News