స్టార్ హీరోయిన్ ఇలియానా బేబీ బంప్ ఫొటోలు వైరల్..

టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2023-05-13 05:12 GMT
స్టార్ హీరోయిన్ ఇలియానా బేబీ బంప్ ఫొటోలు వైరల్..
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోల సరసన నటించి ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా రాణించింది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా కూడా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఆసక్తికర పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల తాను ప్రెగ్నెంట్ అంటూ ఓ పోస్ట్‌తో షాక్ ఇచ్చింది. అంతేకాకుండా బేబీ బంప్ వీడియోను షేర్ చేసింది. అయినా అభిమానుల ఏదో సినిమా ప్రమోషన్స్ అనుకున్నారు. తాజాగా, బేబీ బంప్ బయటకు కనిపించేలా ఉన్న ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ స్కిన్ టైట్ డ్రెస్‌లో చేతిలో డ్రింక్ గ్లాస్ పట్టుకుని నిల్చొని నవ్వుతున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. అంతేకాకుండా ‘బంప్ అలర్ట్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు పెళ్లి కాలేదు.. మరి బిడ్డకు తండ్రి ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.     

Also Read: పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్‌పై.. రామ్ చరణ్ రియాక్షన్ ఇదే 


Tags:    

Similar News