Sobhita-Samantha: సమంతను కుక్క అని తిట్టిన శోభితా ధూళిపాళ్ల.. సంచలన పోస్ట్ వైరల్

హీరోయిన్ శోభితా ధూళ్లపాళ్ల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-08-13 13:42 GMT
Sobhita-Samantha: సమంతను కుక్క అని తిట్టిన శోభితా ధూళిపాళ్ల.. సంచలన పోస్ట్ వైరల్
  • whatsapp icon

దిశ, సినిమా: హీరోయిన్ శోభితా ధూళ్లపాళ్ల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో సెకండ్ స్థానంలో నిలిచిన ఈ బ్యూటీ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘రామన్ రాఘవ్ 2. 0’ హిందీ చిత్రంతో నటన ఫీల్డ్ లోకి అడుగు పెట్టింది. తర్వాత గూఢచారి, పొన్నియన్ సెల్వన్:1 మంకీ మ్యాన్, సితార, కురుప్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక ఫ్యామిలీ విషయాలకొస్తే.. శోభితా మే 31 వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించింది. తల్లి పేరు శాంతా కామాక్షి, తండ్రి వేణు గోపాల్ రావు. తండ్రి ఇంజనీరింగ్ కాగా.. తల్లి ఉపాధ్యాయురాలు.

ఈ హీరోయిన్ చిన్నతనంలోనే ఫ్యామిలీ వైజాగ్ కు షిఫ్ట్ అయ్యింది. ఇక శోభిత విశాఖపట్నంలోనే లిటిల్ ఏంజెల్స్ స్కూలులో చదువుకుంది. డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేదట. కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. రీసెంట్‌గా అక్కినేని నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని ఫ్యాన్స్ శోభితా చరిత్ర మొత్తం బయటకు తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శోభితా గతంలో తన చెల్లెలిని ఫన్నీగా అన్న మాటల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరీ ఆ పోస్ట్‌లో ఏముందో ఇప్పుడు చూద్దాం..

‘‘నా తల్లిదండ్రులపై నాకు ఉన్న ప్రేమ ఎంత గొప్పదో చెప్పలేను. ఎన్ని జన్మలేత్తిన నాకు ఇలాంటి తల్లిదండ్రులే కావాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇక నాకు ఏమీ అవసరం లేదు. నా చెల్లె సమంత కుక్కలా జన్మించినా నాకు ఏం పర్వాలేదు’’. అంటూ శోభితా ధూళిపాళ్ల పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వగా.. సమంతను కుక్కలా పుట్టమన్నావా? కుక్క అని తిట్టావ్ గా పాపం అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇక శోభితా చెల్లెలు సమంత పెళ్లైన వషయం తెలిసిందే. ప్రస్తుతం తన సోదరి సమంత పై ఫన్నీగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News