s/o సత్యమూర్తి సినిమాలోని పాప.. ఇప్పుడు ఎలా ఉన్నదంటే?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, సమంత హీరోయిన్‌గా వచ్చి, మంచి హిట్ అందుకున్న సినిమా సన్నాఫ్ సత్యమూర్తి. ఈ మూవీ ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇందులో నటించిన ప్రతి

Update: 2024-06-14 08:46 GMT

దిశ, సినిమా : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, సమంత హీరోయిన్‌గా వచ్చి, మంచి హిట్ అందుకున్న సినిమా సన్నాఫ్ సత్యమూర్తి. ఈ మూవీ ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు ప్రాణం పెట్టారనే చెప్పాలి. సామ్, నిత్యామీనన్, అల్లు అర్జున్, రాజేంద్రప్రసాద్, సీనియర్ నటి స్నేహ, ఉపేంద్ర ఇలా వీరందరూ ఈ సినిమాలో నటించారు. ఇ వీరితో పాటు ఈ మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ తన నటన, క్యూటీనెస్‌తో అందరినీ ఆకట్టుకుంది.

ఇప్పటికే చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన వారు స్టార్ హీరో, హీరోయిన్స్ రేంజ్‌కు ఎదిగిపోతున్నారు. చైల్డ్ ఆర్టిస్టులను చూసి తమ అభిమానులు షాక్ అవుతున్నారు. నిజంగా వీరు ఆ సినిమాలో నటించిన చిన్న పాప లేదా బాబునేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురి అవుతున్నారు.

ఈమె ఆమెనా అంటూ షాక్ అవుతున్నారు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ అన్న కూతురుగా నటించిన చిన్నారి పేరు వర్ణిక. తాజాగా ఈమె అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సాంగ్ కు రీల్ చేసింది. ఆ సినిమాలోని, సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి సాంగ్ కు వీడియో చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఆమెను చూసిన నెటిజన్స్.. వామ్మో చిన్నప్పుడు బొద్దుగా, క్యూట్‌గా కనిపించిన పాపేనా ఈమె అంటూ అంటూ షాక్ అవుతున్నారు. హీరోయిన్ లెవల్‌లో మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.

Full View


Similar News