రోజుకు ఐదు వేల రెమ్యునరేషన్ తో ప్రారంభం.. ప్రస్తుతం రెండున్నర లక్షలకు పైగా తీసుకుంటున్న నటి

హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీ మంచి గుర్తింపు సంపాదించింది. పర్సనల్ లైఫ్ లో భర్త కారణంగా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన ఆమె.. ప్రొఫెషనల్ గా మాత్రం సక్సెస్ అయింది. 45 ప్లస్ ఏజ్ లోనూ బిడ్డ పలక్ తివారీ అందానికి పోటీ ఇస్తుంది.

Update: 2024-07-09 17:12 GMT

దిశ, సినిమా: హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీ మంచి గుర్తింపు సంపాదించింది. పర్సనల్ లైఫ్ లో భర్త కారణంగా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన ఆమె.. ప్రొఫెషనల్ గా మాత్రం సక్సెస్ అయింది. 45 ప్లస్ ఏజ్ లోనూ బిడ్డ పలక్ తివారీ అందానికి పోటీ ఇస్తుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్ళు అన్నా సరే నమ్మేలా ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తుంది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఫ్రెండ్స్, కొలీగ్స్, తను నటించిన సీరియల్స్ గురించిన విషయాలు పంచుకుంది. ' కసౌతి జిందగీ కయ్ ' సీరియల్ లో లీడ్ రోల్ ప్లే చేసిన ఆమె.. ముందుగా రోజుకు ఐదు వేల రెమ్యునరేషన్ తో వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలిపింది. అయితే ప్రతి ఏటా తమకు ఇంక్రిమెంట్స్ ఉంటాయని.. సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ చేసే సరికి రోజుకు రెండున్నర లక్షలు తీసుకున్నానని చెప్పింది.

కాగా శ్వేత కూతురు పలక్ సక్సెస్ ఫుల్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్ ఖాన్ ' కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ' ఆమెకు డెబ్యూ సినిమా కాగా ఓ ఆల్బమ్ సాంగ్ తోనూ ఆకట్టుకుంది. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తో డేటింగ్ చేస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తోంది.


Similar News