మోడీతో ఆ హీరోయిన్ రొమాంటిక్ ట్రిప్?
బ్యూటిఫుల్ శ్రద్ధా కపూర్ ‘ఆషికీ 2’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు జోడీగా నటించిన ఆదిత్యా రాయ్ కపూర్‌తో బెస్ట్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ చేసింది. అయితే రీల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ
దిశ, సినిమా : బ్యూటిఫుల్ శ్రద్ధా కపూర్ ‘ఆషికీ 2’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు జోడీగా నటించిన ఆదిత్యా రాయ్ కపూర్‌తో బెస్ట్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ చేసింది. అయితే రీల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఈ జంట ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అఫిషియల్ అనౌన్స్మెంట్కు ముందే బ్రేకప్ అయినట్లు తెలియడంతో అభిమానులు నిరాశపడ్డారు. ఇక ఆ తర్వాత శ్రద్ధ చైల్డ్ హుడ్ ఫ్రెండ్‌తో ప్రేమాయణం నడిపినట్లు, త్వరలో మ్యారేజ్ కూడా జరగబోతున్నట్లు న్యూస్ హల్ చల్ చేసింది. కానీ అది కూడా పెళ్లిపీటల దాకా వెళ్లలేదు.
ఇక రీసెంట్గా రైటర్ రాహుల్ మోడీతో రిలేషన్షిప్లో ఉన్నట్లు రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఇద్దరు కలిసి రెండు మూడు సార్లు కెమెరాకు కూడా చిక్కారు. దీంతో వీరిమధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని స్ట్రాంగ్‌గా నమ్మేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇక ఈ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఇద్దరు రొమాంటిక్ వెకేషన్‌కు వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ బంధమైన పెళ్లి బంధంగా మారుతుందేమో చూడాలి. కాగా రాహుల్ మోడీ ‘tu jhoothi main makkaar’ సినిమాకు శ్రద్ధతో కలిసి పనిచేయగా.. అప్పుడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తుంది.