హీరోగా ఎంట్రీ ఇస్తున్న షణ్ముఖ్.. ఆమెతోనే రొమాన్స్..

యూట్యూబర్, నటుడు షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘లీలా’ మూవీ ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు

Update: 2024-06-12 08:34 GMT

దిశ, సినిమా : యూట్యూబర్, నటుడు షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘లీలా’ మూవీ ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ చిత్రం థియేటర్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుందని అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇక ఈ యూత్ ఫుల్ ఫిల్మ్ ద్వారా మాలీవుడ్ హీరోయిన్ అనఘా అజిత్ టాలీవుడ్‌కు పరిచయం కాబోతుంది. మొత్తానికి ఈ న్యూస్‌తో షణ్ముఖ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుండగా.. ఈ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన తీరు ఓ డ్రామాను తలపించిందని నవ్వుకుంటున్నారు.

కాగా గతంలో డ్రగ్స్‌తో పట్టుబడ్డాడని షణ్ముఖ్‌తోపాటు ఆయన బ్రదర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీన్ని బేస్ చేసుకునే ప్రమోషన్ స్టార్ట్ అయింది. ‘లైఫ్‌లో ఎన్నో జరుగుతాయి.. మూవ్ ఆన్ కావాలి కదా’ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టినట్లు క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ ఫామ్ విన్.. అందుకే ‘లీలా’గా మన ముందుకు రాబోతున్నాడని రిప్లయ్ ఇచ్చింది. ఆ తర్వాత షణ్ముఖ్ కూడా పోస్ట్ పెట్టాడు.


Similar News