ఆ సినిమాల నుంచి రిజక్ట్ చేశారు.. స్టేజ్ మీదే కన్నీరు పెట్టుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ?

స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం అభినయం ఈమె సొంతం. తన నటనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నటి ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి అందరినీ ఆకట్టుకుంది. అయితే తాజాగా

Update: 2024-05-22 03:14 GMT

దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం అభినయం ఈమె సొంతం. తన నటనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నటి ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి అందరినీ ఆకట్టుకుంది. అయితే తాజాగా రమ్యకృష్ణకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే? సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో రమ్యకృష్ణ తాను పడిన బాధలు, ఆమెను సినిమాల నుంచి తొలిగించడం గురించి తెలుపుతూ స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకున్నదంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ నటి చాలా సెలక్టివ్‌గా, పాత్రలు చూస్ చేసుకుంటూ వెళ్తున్న విషయం తెలిసిందే. మంచి పాత్ర, పెద్ద సినిమాలకు మాత్రమే ఆమె ప్రియారిటీ ఇస్తుంది. అయితే క్రమంలోనే ఆమె కెరీర్‌కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

అసలు విషయంలోకి వెళితే.. రమ్యకృష్ణను చాలా మంది హీరోయిన్‌గా సెలెక్ట్ చేసి, సినిమాల్లో నుంచి తీసేశారంట. అది ఆమెకు చాలా బాధగా అనిపించేదంట. ఇక తెలుగులో ఎలాంటి అవకాశాలు రావు అనుకునే సమయంలో కె . రాఘవేంద్రరావు తనకు లైఫ్ ఇచ్చారని, అల్లుడు గారు సినిమాకు ఎంపిక చేయడం, అందులో రెండో హీరోయిన్ అయినా పాత్ర బాగుండటంతో అది ఆమె కెరీర్‌కు ప్లస్ పాయింట్ అయిపోయిందంట. ఆ తర్వాత అల్లరి మొగుడు సినిమాలో కూడా అవకాశం ఇవ్వడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో రమ్యకృష్ణకు వరసగా ఆఫర్స్ రావడం మొదలు అయ్యాయంట. అయితే ఒకానొక సమయంలో స్టేజ్‌పై మాట్లాడుతూ..కొందరు నిర్మాతలు సినిమాల్లో ఓకే చేసి, తర్వాత తొలగించారని, చాలా సార్లు జరిగిందని, ఆ సమయంలో రాఘవేంద్రరావు తనని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన ఇంతటి విజయాన్ని, తన వల్లే స్టార్ స్టేజ్‌కు ఎదిగానంటూ.. ఆమె భావోద్వేగాన్ని ఆపుకోలేక మాట్లాడే క్రమంలోనే స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకుంది. స్పీచ్‌ ఇవ్వలేని పరిస్థితి ఆమె వెనుతిరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Similar News