అతన్ని చూడగానే నాలో కామం పుట్టింది : Vidya Balan

బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆలస్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన.. కెరీర్లో భిన్న పాత్రల్లో నటించి గుర్తింపు పొందింది. ‘డర్టీ పిక్చర్’ మూవీతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.

Update: 2023-07-06 06:00 GMT
అతన్ని చూడగానే నాలో కామం పుట్టింది : Vidya Balan
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆలస్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన.. కెరీర్లో భిన్న పాత్రల్లో నటించి గుర్తింపు పొందింది. ‘డర్టీ పిక్చర్’ మూవీతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఇక పెళ్లి తర్వాత కూడా ఆమె వరుసగా సినిమాల్లో నటిస్తూ.. ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా విద్యాబాలన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె పర్సనల్ లైఫ్ గురించి, తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ‘ నిజం చెప్పాలి అంటే సిద్దార్థ్ ను చూడగానే నాకు కామం పుట్టింది.. ఎందుకంటే అతను చాలా అందగాడు. మంచి లుక్ ఉన్న వ్యక్తి. అందుకే చూడగానే అట్రాక్ట్ అయ్యాను. తను నన్ను చాలా సెక్యూర్డ్ గా చూసుకునేవాడు.. అలా అతనిపై నాకు ప్రేమ పుట్టింది. బయట అతనిలా అన్ని విషయాల్లో సపోర్ట్ గా ఉన్నవారు చాలా తక్కువగా ఉంటారు. మా నాన్న తర్వాత తిరిగి అంత ప్రేమను నేను సిద్దార్థ్ నుంచి పొందాను. అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం. చేసుకుంటే కచ్చితంగా అతన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నా. మొత్తానికి అనుకున్నట్టే చేసుకుని సిద్దార్థ్ తో ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నా’ అంటూ చెప్పుకొచ్చింది విద్యా బాలన్.

Read More:   Thalapathy Vijay : తమిళ హీరో దళపతి విజయ్ సంచలన నిర్ణయం.. 

Tags:    

Similar News