SaripodhaaSanivaaram:‘సరిపోదా శనివారం’ ట్విట్టర్ రివ్యూ.. నాని హిట్ కొట్టేనా!

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ చిత్రం నేడు పాన్ ఇండియా లెవల్‌లో గ్రాండ్‌గా రిలీజైంది.

Update: 2024-08-29 02:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: క్లాస్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ - నాచురల్ స్టార్ నాని కాంబినేషనల్‌లో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ చిత్రం నేడు పాన్ ఇండియా లెవల్‌లో గ్రాండ్‌గా రిలీజైంది. ప్రస్తుతం ఈ సినిమా ఓవర్‌సీస్ ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యాయి. మాస్ యాక్షన్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన వివేక్ ఆత్రేయ.. నానికి హిట్ ఇచ్చాడా? లేదా? అనేది చూద్దాం..

సరిపోదా శనివారం ట్విట్టర్ రివ్యూ చూసినట్లైతే.. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. మధ్యలో ఉన్న ఫ్లాట్ నేరేషన్, స్క్రీన్‌ప్లే రొటీన్/ప్రిడిక్టబిలిటీ సినిమా ఫ్లోపై ప్రభావం చూపాయి. ఇది చాలా పొడవుగా అనిపించేలా చేసింది. నాని గతంలో నటించిన మూవీస్ కన్నా ఈ మూవీ దరిద్రంగా ఉండటంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అసలు నాని ఇలాంటి సినిమాకు ఎలా ఒప్పుకున్నాడంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి నాని బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడనుకుంటే ఇలా అయిందేంటి? అని అంటున్నారు.


Similar News