మరో తెలుగు మూవీకి సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్! హీరో ఎవరో తెలుసుకుని షాక్ అవుతున్న ఫ్యాన్స్
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.
దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ‘ఫిదా’ మావితో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. అనతికాంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఎటువంటి స్కిన్ షో చెయ్యకుండా మూవీస్ చేస్తూ ప్రేక్షకుల్లో స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది. కథ ప్రాదాన్యం ఉన్న పాత్రలు ఎంచుకుటున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య ‘తండేల్’ మూవీతో పాటు హిందీలో రెండు భారీ ప్రాజెక్ట్‌లు చేస్తోంది. అందులో ‘రామాయణం’ ఒకటి. ఇక తమిళంలో ‘అమరన్’లో నటిస్తున్న సాయి పల్లవి.. ఈ మూవీస్ సెట్స్‌పై ఉండగానే తెలుగులో మరో ఆఫర్‌కు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రవికిరణ్ కోలా కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. అందమైన ప్రేమకథతో రూరల్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఇందులో హీరోయిన్గా సాయి పల్లవిని ఫిక్స్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట మేకర్స్. ఇప్పటికే ఈ విషయమై నేచురల్ బ్యూటీని సంప్రదించగా చర్చలు పూర్తయినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ మూవీ విషయంలో ఆమె పాజిటివ్‌గా ఉందని టాక్. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే.. గతంలో విజయ్ దేశరకొండ సరసన రెండు ఆఫర్లు వచ్చిన వాటిని రిజెక్ట్ చేసిన సాయిపల్లవి.. ఇప్పుడు ఈ మూవీ నిజంగా ఓకే చేసిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.