‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్..

నవ దళపతి సుధీర్ బాబు అప్ కమింగ్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’.

Update: 2024-09-28 13:22 GMT

దిశ, సినిమా:  నవ దళపతి సుధీర్ బాబు అప్ కమింగ్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’. ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఫుల్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కతున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నాడు. CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్‌గా రిలీజైన టీజర్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా రీసెంట్‌గా ఇందులో నుంచి ఫస్ట్ సింగిల్ 'నాన్న సాంగ్'కు సోషల్ మీడియాలో మంచి స్పందన రాగా.. ఈ రోజు సెకెండ్ సింగిల్ ‘వేడుకలో’ సాంగ్‌ని రిలీజ్ చేశారు.

జై క్రిష్ ఈ పాటని పర్ఫెక్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్ సాంగ్‌గా కంపోజ్ చేశారు. సనాపతి భరద్వాజ పాత్రుడు రాసిన బ్యూటీఫుల్ అండ్ మీనింగ్ ఫుల్ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్‌లో సుధీర్ బాబు కూల్ ప్రజెన్స్ కట్టిపడేసింది. ఎలిగెన్స్ డ్యాన్స్ మూమెంట్స్ అదరగొట్టారు. సుధీర్ బాబు, సాయి చంద్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచింది. కాగా.. ‘మా నాన్న సూపర్ హీరో’ అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది.


Similar News