Rajinikanth: సెన్సార్ పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ మూవీ ‘వెట్టైయాన్’.. రన్ టైమ్ ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టైయాన్’.

Update: 2024-09-28 12:02 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టైయాన్’. ఇందులో తలైవా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించబోతుండగా.. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, మంజువారియర్, రిత్విక సింగ్, దుషారా విజయన్, రానా కీలక పాత్రలో నటించగా.. దీనిని టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

అయితే ‘వెట్టైయాన్’ మూవీ అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా, ‘వెట్టైయాన్’ సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ పొందినట్లు తెలుస్తోంది. రన్‌టైమ్ 2:47 గంటలు (167 నిమిషాలు) ఉన్నట్లు టాక్. ప్రజెంట్ దీనికి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వెట్టైయాన్ విడుదలకు ఇంకా 12 రోజుల సమయం ఉండటంతో అప్పుడే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.


Similar News