‘చిరుత’కు 17 ఏళ్లు.. స్పెషల్ పోస్ట్ వైరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా ‘చిరుత’.

Update: 2024-09-28 13:18 GMT

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా ‘చిరుత’. డ్యాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇదే రోజున (2007, సెప్టెంబర్ 28న) రిలీజైంది. అంటే రామ్ చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి కూడా 17ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ ఫిలిమ్స్ తాజాగా X ఖాతా ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ‘17 ఏళ్ల క్రితం ఇదే రోజున గ్లోబల్ స్టార్ ఎదుగుదలను ప్రపంచం చూసింది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన తొలిచిత్రం చిరుత బాక్సాఫీస్ వద్ద తుఫానులా తీసుకువెళ్లింది. చెర్రీ అద్భుతమైన సినిమా ప్రయాణానికే వేదికగా నిలిచింది’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. చెర్రీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Similar News