ప్రైవేట్ ఫొటో షేర్ చేసిన హీరోయిన్.. భర్త అక్కడ చేతులు వేయగా తీసుకున్న పిక్ వైరల్

బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా.. ' మీర్జాపూర్ ' ఫేం అలీ ఫజల్ ప్రేమించుకున్నారు. కొన్నాళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్యే తల్లిదండ్రులుగా మారబోతున్నామని శుభవార్త కూడా చెప్పారు.

Update: 2024-07-17 04:14 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా.. ' మీర్జాపూర్ ' ఫేం అలీ ఫజల్ ప్రేమించుకున్నారు. కొన్నాళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్యే తల్లిదండ్రులుగా మారబోతున్నామని శుభవార్త కూడా చెప్పారు. ఇక కొద్దిరోజుల్లో బేబీకి వెల్ కమ్ చెప్పబోతుండగా ఫొటో షూట్ చేసుకున్నారు ఈ దంపతులు. రిచా బేబీ బంప్ పై అలీ ప్రేమగా చేతులు వేయగా..

ఆమె కూడా అంతే హ్యాపీగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. మొత్తానికి నిజమైన ప్రేమకు నిదర్శనం అన్నట్లుగా ఉంది ఫొటో.

అయితే ఈ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన రిచా... కామెంట్ సెక్షన్ మ్యూట్ చేసింది. ఇది తన మనసుకు చాలా దగ్గరైన ఫొటో అని చెప్పుకొచ్చింది. ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేదనే ఉద్దేశ్యంతో ఇలా చేసింది. ఈ ప్రైవర్ పిక్ పై కామెంట్స్ చేస్తే ఏం చేయాలో అర్థం కాక బాధపడిపోవాల్సి వస్తుందని చెప్పింది. కాగా దీపిక పదుకునే ప్రమోషన్స్ లో హై హీల్స్ వేసుకున్నందుకు చాలా మంది విమర్శించగా.. అది చెప్పే అర్హత ఎవరికి లేదని డీపీకి సపోర్ట్ ఇచ్చింది.


Similar News