Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జునపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట వ్యాప్తంగా సీఎం కేసీ‌ఆర్ అమలు చేసిన పథకం రైతు బంధు. ఈ పథకం దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, మంత్రులు ఉపన్యాసాలు ఇస్తున్న సంగతి తెలిసిందే..

Update: 2022-12-17 07:10 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట వ్యాప్తంగా సీఎం కేసీ‌ఆర్ అమలు చేసిన పథకం రైతు బంధు. ఈ పథకం దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, మంత్రులు ఉపన్యాసాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి రైతుబంధు పథకం గురించి మాట్లాడుతూ.. అక్కినేని నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వందల ఎకరాల ఉన్న ధనవంతులకు కూడా రైతు బంధు వర్తింపజేయడంపై ఆయన మాట్లాడారు. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా రైతు బంధు పథకం వస్తుందని. ఆయనకు అ డబ్బులు అవసరమా? అంటూ ఆకునూరి మురళి ప్రశ్నించారు. సినిమా యాక్టర్లు, ఎన్‌ఆర్ఐ‌లు రైతులా అని ఫైర్ అయ్యాడు. అత్యంత సంపన్న వర్గాలకు రైతుబంధు ఇవ్వడంలో అంతర్యమేమిటన్నారు. వందల ఎకరాలు ఉన్న వారు లక్షల రూపాయలు రెండు సార్లు ప్రభుత్వం నుంచి పొందుతున్నారని పేర్కోన్నాడు. తెలంగాణ రాష్టంలో 60 లక్షల మంది రైతులు, 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని తెలిపారు. రైతు బంధు దిక్కుతోచని దయనీయ స్థితిలో ఉన్న రైతులకు అందిస్తే పథకానికి అర్థం ఉంటుందని తెలిపారు.

Also Read...

భార్యతో ఎమోషనల్ పిక్ షేర్ చేసిన ఎన్‌టీ‌ఆర్ ! 

Tags:    

Similar News