నీకు పాన్ ఇండియా సినిమా తీసే రేంజ్ ఉందా?.. కిరణ్ అబ్బవరంను అవమానించిన రిపోర్టర్ కు బేఫిట్టింగ్ రిప్లై

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు చేస్తున్నా ఫెయిల్యూర్స్ చూస్తున్నాడు. ఒక్క మూవీ అయినా సక్సెస్ కాకపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా ఫిల్మ్ 'KA'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

Update: 2024-07-16 02:49 GMT

దిశ, సినిమా : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు చేస్తున్నా ఫెయిల్యూర్స్ చూస్తున్నాడు. ఒక్క మూవీ అయినా సక్సెస్ కాకపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా ఫిల్మ్ 'KA'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించారు మేకర్స్. అయితే ఈ సందర్భంగా మీడియాను ఇన్వైట్ చేయగా.. ప్రశ్నలు అడిగారు. అయితే ఓ రిపోర్టర్ హీరోను అవమానించేలా క్వశ్చన్ చేశాడు. దీనికి ఏ మాత్రం ఫీల్ కాకుండా బేఫిట్టింగ్ రిప్లై ఇచ్చాడు కథానాయకుడు.

' బి గ్రేడ్ హీరో అయిన నువ్వు పాన్ ఇండియా సినిమా చేయడమేంటి? ఒక్క మూవీ ఆడితే బాగుండని నువ్వే అంటున్నావ్ కదా. అలాంటప్పుడు ఈ రేంజ్ ఫిల్మ్ నీకు అవసరమా? నీకు అంత లెవల్ ఉందా?' అన్నట్లుగా అడిగాడు. దీనికి సమాధానంగా 'నిజానికి రేంజ్ అనేది కంటెంట్ డిసైడ్ చేస్తుంది. అలాంటి కెపాసిటీ తమ కంటెంట్ కు ఉందనే పాన్ ఇండియా ఫిల్మ్ తీసేందుకు డిసైడ్ అయ్యాం ' అని చెప్పాడు. ఇక ఈ కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కిరణ్ అబ్బవరం సరిగ్గా చెప్పాడని అంటున్నారు. ఈ మూవీ పక్కా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.


Similar News