అల్లు అర్జున్‌తో పోటీ ఎందుకని ఆ మూవీ నుంచి తప్పుకున్న రవితేజ!

సినీ ఇండస్ట్రీలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో రవితేజ ఒకడు. మాస్ మహారాజగా మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. నటనా పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ రవితేజ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు.

Update: 2024-06-12 06:10 GMT

దిశ, సినిమా : సినీ ఇండస్ట్రీలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో రవితేజ ఒకడు. మాస్ మహారాజగా మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. నటనా పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ రవితేజ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం రవితేజ హీరోగా, భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ దీనిని నిర్మిస్తున్నాడు. రవితేజ వాస్తవానికి అమితాబ్ బచ్చన్‌కు పెద్ద ఫ్యాన్. ఈ నేపథ్యంలో మూవీకి కూడా అతని అభిమాన నటుడి పేరు వచ్చేలా ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్‌ డిక్లేర్ చేయడం విశేషం. బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రైడ్ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలీజైన అప్డేట్స్ కూడా రవితేజ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

‘మిస్టర్ బచ్చన్’ కోసం ఫ్యాన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ శర వేగంగా కొనసాగుతుండటంతో ఆగష్టులో రిలీజ్ చేయాలని మేకర్స్ మొదట భావించారు. అయితే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప 2’ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసుకొని, ఆగష్టు 15న రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఓ వైపు రవితేజ మిస్టర్ బచ్చన్, మరో వైపు అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీస్ ఓకే నెలలో రిలీజ్ అయితే ఏదో ఒక సినిమాకు గ్రాస్ పరంగా, ఇమేజ్ పరంగా కాస్త డ్యామేజ్ జరిగే చాన్స్ ఉంది. పైగా ఇద్దరు ఫేమస్ హీరోలు, వారి ఫ్యాన్స్ మధ్య పోటీ వాతావరణం క్రియేట్ అవుతుంది. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని రవితేజ ‘మిస్టర్ బచ్చన్ మూవీ’ని వాయిదా వేయాలని డైరెక్టర్‌ హరీశ్ శంకర్‌కు సూచించారట. దీంతో ఆగష్టులో రిలీజ్ కాకనున్న మిస్టర్ బచ్చన్‌ను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన రవితేజ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ‘అల్లు అర్జున్‌తో పోటీ ఎందుకని తప్పుకుంటున్న మాస్ మహారాజ మంచి మనస్సున్న వాడు’ అంటూ తెగ పొగిడేస్తున్నారు. 


Similar News