అల్లు అర్జున్ కారణంగా ‘పుష్ప-2’ సినిమా నుండి తప్పుకున్న రష్మిక?
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప..
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా 2021డిసెంబర్ 17న విడుదలై ప్రేక్షకుల్లో భారీ రెస్పాన్స్‌ను దక్కించుకుని రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. దీనిని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించాడు. దీనికి సీక్వెల్‌గా పుష్ప-2 సినిమాను తీసుకొస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం స్టైలీ స్టార్ పుష్ప2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇందులో రష్మిక మందన కాకుండా మరో స్టార్ హీరోయిన్ కూడా ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా, ఈ సినిమా నుంచి రష్మిక మందన తప్పుకున్నట్లు సినీ క్రిటిక్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘‘రష్మిక మందన్న నిన్న పుష్ప 2 షూటింగ్ నుంచి వెళ్లిపోయింది. ఆమెను అల్లుఅర్జున్ దారుణంగా ఆటపట్టించేవాడు దానికి రష్మిక ఫీల్ అయి సినిమా నుంచి తప్పుకుంది’’ అంటూ ఉమైర్ సందు ట్వీట్ చేశాడు. దీంతో అది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అతడిని తిట్టి పోస్తున్నారు.
Read more:
టైట్‌గా ఉంటేనో, బ్లెడ్ వస్తేనో వర్జిన్ కాదు.. ప్రముఖ సింగర్ వీడియో వైరల్
BREAKING NEWS: #RashmikaMandanna left the shoot of #Pushpa2 yesterday. As per sources, She was feeling uncomfortable with #AlluArjun. He was teasing her badly.
— Umair Sandhu (@UmairSandu) March 16, 2023